వైసీపీ వర్సెస్ జనసేన..చెప్పులు-డ్రాయర్లు అంటూ దారుణం..!

-

ఏపీ రాజకీయాలు మరీ దారుణంగా తయారయ్యాయి. నేతల మాటలు హద్దులు దాటేశాయి. రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా బూతులు తిట్టుకోవడం అలవాటు అయిపోయింది. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తుంటే వాటికి వైసీపీ నేతలు బూతులతోనే కౌంటర్లు ఇస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు సైతం బూతులతోనే సమాధానం చెబుతున్నారు. తాజాగా వైసీపీ, జనసేనల మధ్య విమర్శలు మరింత దిగజారిపోయాయి.

ఆ మధ్య ఎప్పుడో తనని గాని, తన కుటుంబాన్ని గాని తిడితే చెప్పు తీసుకుని కొడతానని పవన్ చెప్పు చూపించారు. ఇదే క్రమంలో ఇటీవల పేర్ని నాని రెండు చెప్పులు చూపించి మక్కెలు విరగ్గొడతా అంటూ ఫైర్ అయ్యారు. ఇక పవన్ తాజాగా..అన్నవరం గుడిలో తన రెండు చెప్పులు ఎత్తుకుపోయారని, రెండు చెప్పులతో ఎవరైనా కనిపిస్తే చెప్పాలని పేర్నికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇక జనసేన నేతలు..పేర్నినే పవన్ చెప్పులు ఎత్తుకుపోయారని ఎద్దేవా చేస్తున్నారు.

ఇదే క్రమంలో వైసీపీ నేతలు కూడా తమ మాటలకు పదును పెట్టారు.  పేర్ని నాని చెప్పులు, డ్రాయర్లు పవన్‌ కళ్యాణ్‌ దోచేశాడని, పేర్ని నాని ఇంట్లో ఎవరో చెప్పులు డ్రాయర్లు దోచేశారట అని మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. ఇక ఆ వ్యక్తి కాకినాడ జిల్లాలో లారీ ఎక్కి తిరుగుతున్నాడనిఎద్దేవా చేశారు.  టి‌డి‌పి హయాంలో విజయవాడ లో గుళ్ళు కూలగొడితే  నోట్లో ఏం పెట్టుకున్నావు అంటూ పవన్‌ని దారుణంగా విమర్శించారు.

పవన్ కళ్యాణ్ ను సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్తే బాగుంటుందని, గంట గంటకు కలలు గని రకరకాలుగా మాట్లాడతాడని, పవన్ మాటలకు క్లారిటీ ఉందా? వారాహి యాత్ర రెండు సభలు ఫెయిల్ అయ్యాయని అన్నారు. ఇలా రెండు పార్టీల మధ్య దారుణంగా బూతుల పర్వం నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news