వావ్: స్కాట్లాండ్ ఆశలు ఆవిరి.. వరల్డ్ కప్ మెయిన్ డ్రాకు నెదర్లాండ్… !

-

కాసేపటి ముందు స్కాట్లాండ్ మరియు నెదర్లాండ్ జట్ల మధ్యన ముగిసిన వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్ లో నెదర్లాండ్ నాలుగు వికెట్లతో విజయాన్ని అందుకుని వరల్డ్ కప్ మెయిన్ డ్రా కు శ్రీలంక తో పాటుగా సగర్వంగా అర్హత సాధించింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న నెదర్లాండ్ స్కాట్లాండ్ ను 277 పరుగుల వద్ద నియంత్రించింది. స్కాట్లాండ్ ను ఆ మాత్రం స్కోర్ కు కట్టడి చేయడంలో నెదర్లాండ్ ఆల్ రౌండర్ బస్ డే లీడ్ కీలక పాత్ర పోషించాడు… ఓవర్లు వేసిన ఇతను అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఇక స్కాట్లాండ్ లో ఆల్ రౌండర్ బ్రెండన్ మెక్ ముల్లెన్ సెంచరీ (106) సాధించాడు. ఆ తర్వాత 278 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించగా మళ్ళీ బాస్ డే లీడ్ సెంచరీ (123) తో అదరగొట్టి స్కాట్లాండ్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.

ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు మరియు 5 సిక్సులు ఉన్నాయి. ఈ ఓటమితో స్కాట్లాండ్ తీవ్ర నిరాశతో ఇంటి దారి పట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news