యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. శిల్పం వర్ణం కృష్ణం పేరుతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం అంగరంగవైభంగా ప్రారంభం కానున్నాయి. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్‌లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో… ప్రముఖ కళాకారులు పాల్గొని ప్రదర్శనలతో అలరించనున్నారు.
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా…. శిల్పం వర్ణం కృష్ణం పేరుతో నిర్వహంచనున్న వేడుకలకు సంబంధించిన గోడ పత్రికలను విడుదలు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, ప్రఖ్యాత డ్రమ్స్ కళాకారుడు శివమణిలతో.. సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సుమారు 300మందికి పైగా కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. సంప్రదాయ గిరిజన నృత్యాలు, రామప్ప వైభవం పై లేజర్ షో, కళాకారుల పేరణి నృత్యం… ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు… ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఎక్కువ మంది సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు వీలుగా… హనుమకొండ, ములుగు నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రామప్ప వారసత్వం పై వీడియో ప్రదర్శన సైతం ఏర్పాటు చేశారు.