వామ్మో.. తమలపాకు తో ఈ రోగాలు కూడా నయం అవుతాయా..?

-

ప్రస్తుతం అందరూ పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానవుల జీవితాలపై ఎంతో ప్రభావితం చూపిస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంతవరకు కూడా మనం వాటిపై దృష్టి పెట్టడం లేదు. కానీ కొన్ని సమస్యలను మనం ఇంట్లోనే ఉన్న ఔషధాలతో పరిష్కారం చేసుకొనవచ్చు. అలానే పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అలాంటి ఔషధాల్లో తమలపాకులు ఒకటి. వీటిలో కాల్షియం, ఇనుము, విటమిన్ సి, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ తమలపాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకు లాభాలు:
మనకి ఆకలి అనిపించినప్పుడు నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే.. ఆకలి వేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

కడుపు ఉబ్బరంగా ఉంటే రెండు తమలపాకులు తీసుకుని చేతితో నలిపి వాటిని పాలలో కలుపుకొని తాగితే కడుపు ఉబ్బరం సమస్య చిటికెలో తగ్గిపోతుంది. ఇలా చేస్తే మనకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.

తలనొప్పి కానీ మైగ్రేన్ కానీ వున్నవారికి తమలపాకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ఈ ఆకులను నుదుటి మీద రాయడం కానీ, తమలపాకుల రసంతో మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది.

జీర్ణ ప్రక్రియలో అరుగుదలకు సహకరించే యాసిడ్స్ ను ఉత్పత్తి చేయడానికి తమలపాకు సహకరిస్తుంది. ఎప్పుడైనా చిన్న గాయాలు కానీ వాపు , నొప్పి తగిలితే తమలపాకులను నొప్పి ఉన్నచోట ఉంచాలి. వీటి రసంతో మసాజ్ చేస్తే నొప్పులు కూడా తగ్గుతాయి. అలానే దగ్గు,జలుబు వంటి సమస్యలకు తమలపాకులు తినడం వలన కఫం రాదు.. రోజు తమలపాకులను తినడం ద్వారా దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news