బ్లాక్ చీరలో అందాలు ప్రదర్శిస్తున్న చైతూ భామ..!!

-

అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే హీరోయిన్ శోభిత ధూళిపాళ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో విజయాలు అందుకుంటోంది. బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. టాలీవుడ్ లోకి మాత్రం గూఢచారి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుసగా హిందీ, మలయాళం మూవీస్ లో నటిస్తు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ అడవి శేషుతో కలిసి మేజర్ సినిమాలో నటించింది. రీసెంట్గా PS -1 చిత్రంలో కూడా నటించింది. మంకీ మ్యాన్ అని హాలీవుడ్ మూవీ లో కూడా అవకాశం దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసేది తక్కువ అయినా శోభిత.. కానీ చేసిన ఫోటోలు క్షణాలలో వైరల్ గా మారేలా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన అంద చందాలతో చీరకట్టులో ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా బ్లాక్ శారీలో శోభిత అందాలతో ఆడియన్స్ను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

Imageతన హెయిర్ కి ముడి కట్టి అలా నడుస్తూ వెనక్కి చూస్తూ చూపులతోనే కుర్రాళ్ళు గుండెల్లో గిలిగింతలు పెట్టేలా చేస్తుంది శోభిత. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి చైతన్య ,శోభిత ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

శోభిత ధూళిపాళ సినిమాలలో కంటే ఫోటో షూట్ వల్లే మంచి క్రేజ్ సంపాదించిందని చెప్పవచ్చు. ఆ తరువాత హీరోయిన్ గా మారింది. తన అంద చందాలతోనే కాకుండా యాక్టింగ్ తో కూడా మెప్పిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అలా ఒకవైపు టాలీవుడ్, బాలీవుడ్, మలయాళం వంటి చిత్రాలలో కూడా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం శోభిత కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news