వామ్మో.. పవన్ కళ్యాణ్ రేంజ్ మామూలుగా లేదుగా..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్. జే.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ తోనే భూమికకు అప్పట్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ కూడా దక్కింది. ముఖ్యంగా రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ సినిమా యూత్ ను భారీ స్థాయిలో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను థియేటర్లలో డిసెంబర్ 31వ తేదీన రీరిలీస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టికెట్లు దొరకడం ప్రస్తుతం ఉంటుందని కూడా సమాచారం.

ఎర్లీ మార్నింగ్ షోలకు బ్లాక్ లో ఈ సినిమా టికెట్ ధరలు ఏకంగా 1000 రూపాయల అటు ఇటుగా ఉన్నాయని రికార్డు స్థాయిలో భారీ స్క్రీన్ లలో రిలీజ్ అవుతున్న ఖుషి సినిమాకి టికెట్లు దొరకడం లేదు అంటే ఈ సినిమా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ నటనకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇకపోతే ప్రీమియర్ల టికెట్ల కోసం ఈ స్థాయిలో పోటీ ఉందని తెలుస్తోంది. ఖుషి సినిమాకి థియేటర్లలో పెద్దగా పోటీని ఇచ్చే సినిమాలేవి లేకపోవడంతో ఇప్పుడు ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.

రవితేజ ధమాకా మూవీని చూసిన ప్రేక్షకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా చూడడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. ఈ వయసులో కూడా పవన్ కళ్యాణ్ కి మాత్రం వయసు పెరుగుతున్న ఎక్కడా కూడా ఇసుమంతైన క్రేజ్ తగ్గకపోవడమే గమనార్హం.ఇప్పటికీ ఇంత క్రేజ్ తో దూసుకుపోతున్నారు అంటే నిజంగా గ్రేట్ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news