మేనిఫెస్టో విడుదలపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ

-

దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో మే 13న లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టాయి.ముఖ్యమంత్రి జగన్ ఓ అడుగు ముందుకేసి వైసీపీ మేనిఫెస్టో తేదీని ఖరారు చేశారు.ఉగాది రోజున (ఏప్రిల్ 9న) వైసీపీ ఎన్నికల ఫెనిఫెస్టోను రిలీజ్ చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.

గత ఐదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ఈసారి ఎన్నికల హామీలు ఏమి ఇవ్వబోతున్నారనే సర్వత్రా ఉత్కంఠ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలలో నెలకొంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 6 గ్యారంటీలు అంటూ రాష్ట్రమంతటా ప్రచారం ప్రారంభించింది. దీంతో వైసిపి మానిఫెస్టో లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయని ఉత్కంఠ గా ప్రజలు ఎదురుచూస్తున్నారు.ఈ సారి కూడా ప్రజల సంక్షేమంపైనే హామీలు పొందుపర్చారా లేదంటే అభివృద్ధి, రాజధాని అంశాలపై కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news