టీడీపీ కంచుకోటలో వైసీపీ పాగా?

-

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…అధికార, విపక్ష పార్టీల దూకుడుతో…ఊహించని విధంగా రాజకీయం మారుతుంది. ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా నడిచిన రాజకీయం…ఇప్పుడు వైసీపీకి కాస్త వ్యతిరేకమవుతుంది..అదే సమయంలో కొంత టీడీపీకి ప్లస్ అవుతుంటే…మరోవైపు జనసేనకు కూడా కలిసొస్తుంది. కాకపోతే పూర్తి స్థాయిలో వైసీపీపై వ్యతిరేకత పెరగని నేపథ్యంలో టీడీపీ-జనసేనల బలం పూర్తిగా పెరగడం లేదు.

పైగా వైసీపీ…టీడీపీ కంచుకోటల్లో బలం పెంచుకుంటుంది. టీడీపీ సిట్టింగ్ సీట్లలో వైసీపీ హవా నడుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్ల వైసీపీకి అడ్వాంటేజ్ గా మారింది. ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఇచ్చాపురంలో వైసీపీ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. ఇచ్చాపురం టీడీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

1983 నుంచి 2019 వరకు చూసుకుంటే…ఇక్కడ టీడీపీ ఓడింది కేవలం ఒక్కసారి మాత్రమే..అది కూడా 2004లోనే. మళ్ళీ అక్కడ టీడీపీకి ఎదురవ్వలేదు. జగన్ వేవ్ ఉన్న 2019 లో కూడా ఇచ్చాపురంలో టీడీపీ గెలిచింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ సీన్ మారింది. పైగా ప్రతిపక్షంలోకి వెళ్ళాక టీడీపీ ఎమ్మెల్యే అశోక్…స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు. ఎలాంటి పనులు చేయలేమని చెప్పి…ఆయన ఎక్కువగా విశాఖకే పరిమితమవుతున్నారని తెలిసింది.

అయితే ఇదే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారింది…ఇక్కడ వైసీపీ నేత పిరియా సాయిరాజ్ దూకుడుగా పనిచేస్తున్నారు. అధికారంలో ఉండటంతో పనులు చేయిస్తున్నారు. ప్రజలకు అండగా ఉంటున్నారు. పైగా గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఈయనపై ఉంది. అలాగే 2009 ఎన్నికల్లో ఈయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది…నియోజకవర్గంపై పట్టు ఉంది.

ఎలాగో స్థానిక ఎమ్మెల్యే అశోక్ సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో ఈ సారి ఇచ్చాపురం ప్రజలు సాయిరాజ్ వైపు మొగ్గు చూపేలా ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ కంచుకోటగా ఉన్న ఇచ్చాపురంలో వైసీపీ జెండా ఎగిరేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news