అన్న వస్తాడు, మావయ్య వస్తాడని మాయ మాటలు ఎందుకు : పవన్‌

-

కోనసీమ జిల్లా మండపేట కౌలు రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అన్న వస్తాడని వైసిపి నేతలూ మోసం చేశారు. అన్న వస్తాడు, మావయ్య వస్తాడని మాయ మాటలు ఎందుకు. వైసీపీ నేతల్లా నాకు కోట్లు లేవు. ప్రజల కష్టాలు తెలుసుకుని తీర్చాడానికి వచ్చా . రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లా నుండే మార్పు రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ జగన్మోహనరెడ్డి లాగా ముద్దులు పెట్టుకోవాలి. అంబేద్కర్ ను రాజకీయాలకు వాడుకోవద్దు. నిజంగా ప్రేమ ఉంటే అన్ని జిల్లాలతోపాటే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం ఎందుకు చేయలేదు.

60 Cr Earning Pawan Kalyan Can't Afford 2 Cr Worth Cars?

రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడటం వలనే అమలాపురం అల్లర్లకు కారణం. నా గెలుపు మీ చేతుల్లోనే ఉంది. గెలిచిన, గెలవకపోయిన ప్రజలకు అండగా ఉండి పోరాడతా. నిధులు వస్తాయనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించారు. పంచాయితీ నిధులు దారి మళ్ళీంచి నిర్వీర్యం చేస్తున్నారు. జనసేన అధికారంలోకి వస్తే పంచాయితీలకు నిధులు ఇస్తాం. నిరుద్యోగుల ఉపాధి కోసం పది లక్షలు రూపాయలు వంతున రుణాలు ఇస్తాం. త్వరలోనే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. 2024 ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయమని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news