ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనాతో ఇబ్బంది పడుతున్న వేళ మరో సమస్య ఒకటి వెలుగులోకి వచ్చింది. చిన్న పిల్లల అక్రమ రవాణా పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కరోనా సమయంలో ఈ కార్యక్రమం యాక్టివ్ గా జరుగుతుంది అని పోలీసులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకుంది. పోలీసులకు కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు. ట్విట్టర్ లో మంత్రి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
చిన్న పిల్లల అక్రమ రవాణా, దత్తత రాకెట్ లు కోవిడ్ సమయం లో ఆక్టివ్ గా మారుతున్నాయి అని ఆయన తెలిపారు. ఇలాంటి అనేక సంఘటనలు మా దృష్టికి వచ్చాయి అని ఆయన పేర్కొన్నారు. 10 జిల్లాల్లో మనుషుల అక్రమ రవాణా కు వ్యతిరేకంగా ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసాం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Threat of #childtrafficking & illegal #adoption rackets are coming into play during this pandemic & several genuine tragedies have come to our attention.
AP sets up #AntiHumanTrafficking units in 10 districts to deal with offences of human trafficking#YSJaganCares pic.twitter.com/dSLsXjVYCj— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) May 18, 2021