బంగారం ధరలు మరెంత పైపైకి.. ధరలు ఎలా వున్నాయంటే…?

-

పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్. ధరలు వసరుసగా నాల్గవ రోజు కూడా పెరిగాయి. ఈరోజు కూడా బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా 4వ రోజు కావడం గమనార్హం. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

 

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ధరలు మరో సరి పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే…. హైదరాబాద్ లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పైకి కదిలింది. దీంతో రేటు రూ.49,590కు చేరింది.

ఇది ఇలా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 పెరుగుదల తో రూ.45,450కు చేరింది. అదే విధంగా విజయవాడలోనూ ఇదే రేట్లు వున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వాటి వలన బంగారం పై ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసినదే.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరుగులు పెరుగుతున్నాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.17 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1871 డాలర్లకు చేరింది. బంగారం ధరకు మూడు నెలల గరిష్ట స్థాయి అని చెప్పొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news