తమ ప్రభుత్వం సారా, మద్యంపై వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కాగ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. అక్రమ సారా ను అడ్డుకోవడానికి తమ ప్రభుత్వం ప్రత్యేకంగ ఎస్ఈబీ అనే వ్యవస్థనే తీసుకువచ్చిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్తీ సారా ఎక్కువ ఉండేదని అన్నారు. దాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం శ్రమ పడుతుందని వివరించారు.
అలాగే జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాల గురించి ఆరోగ్య శాఖ మంత్రి తో పాటు స్వయంగా ముఖ్యమంత్రి స్పందించినా.. టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. సారా మరణాలపై టీడీపీ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు జరగకుండా.. స్పీకర్ పోడియం ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్పీకర్ పోడియం ఎక్కితే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయారా అని అన్నారు.అలా సస్పెండ్ చేస్తే.. సస్పెండ్ చేశారని గగ్గోలు పెడుతారని విమర్శించారు.