ఎర్ర ముసుగులో పసుపుదళం… సీబీసీపీఐ!

-

దేశంలో రకరకాల రాజకీయ పార్టీలో తెరపైకి వస్తుండటం.. కొన్ని నిలబడటం, మరికొన్ని ఆరంభ సూరత్వం అనంతరం కనుమరుగవడం తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పేరు ఒకటి రాజకీయ విమర్శల్లో తెరపైకి వచ్చింది. అసలు దానికి గల కారణం ఏమిటి.. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

అమరావతి ప్రాంతంలో పేదలు నివసం ఉండటానికి వీలు లేదు! అవును… గత ప్రభుత్వ వైభవాల్లో ఇదొకటి! పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటారు! ఇది ప్రస్తుత ప్రతిపక్షం నుంచి మరో వైభవం! సరే.. చంద్రబాబు నుంచి అంతకు మించి ఆశించడం కూడా అత్యాశే అవుతుందనుకుని సరిపెట్టుకున్నవారికి… పేదల తరుపున నై నై… బాబు మాటకే సై సై అంటున్నారు కమ్యునిస్టులు!

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీ అంటే… అది కమ్యునిస్టు పార్టీలే అని గతంలో చెప్పుకున్నప్పుడు విన్నట్లు గుర్తు! ఎక్కడ పేదవాడు ఇబ్బంది పడితే అక్కడ వారు వాలిపోతారు.. వారి తరుపున వకాల్తా పుచ్చుకుంటారు అనేది నానుడి!! అయితే అది గతం… ఆ కమ్యునిజం వేరు.. ప్రస్తుతం బాబు కనుసన్నల్లో నడుస్తున్న ఎర్ర ముసుగులో పసుపుదళం పుష్కలంగా ఉన్న కమ్యునిజం వేరు!

ప్రస్తుతం ఏపీలో బాబు రాజకీయాలకు తానా అంటే తందానా అన్నట్లుగా మారిపోయిన కమ్యునిస్టులపై వైకాపా నేతలు వేస్తున్న సెటైర్లకు పెరుగుతున్న మద్దత్తే దీనికి కారణం. ఈ క్రమంలో మైకందుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. కమ్యునిస్టులపై ఫైరవుతున్నారు! పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వటం కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతం.. కానీ రాష్ట్రంలో వారి తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. “చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా” అని పేరు మార్చుకుంటే మంచిది అని సూచిస్తున్నారు!

ప్రస్తుతం ఏపీలో కమ్యునిస్టుల తీరు చూసినవారందరికీ ఈ మాట సబబుగానే అనిపిస్తుండటం ఈ సందర్భంగా కొసమెరుపు! ఇకనైనా కమ్యునిస్టులు ప్రజల తరుపున, పేదల తరుపున, బడుగు బలహీనవర్గాల పక్షపాతిగా పనిచేయాలని… పుచ్చలపల్లి సుందరయ్యను గుర్తుకు తెచ్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు!! వినరని తెలిసినా….!!

Read more RELATED
Recommended to you

Latest news