దమ్ముంటే తనపై పోటీ చేయాలని కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన కళ్యాణ్ కు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఉందా?.. అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. చంద్రబాబు స్క్రిప్టును చదువుతూ ఉనికి కోసం పర్యటనలు మొదలు పెట్టారని విమర్శించారు.
ఒకవైపు బీజేపీతో కాపురం చేస్తూ.. మరోవైపు టిడిపి తో జత కట్టేందుకు పవన్ కళ్యాణ్ తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. కర్నూలు రైతులను పరామర్శించిన ఆయన గతంలో చంద్రబాబు కర్నూలుకు ఇచ్చిన హామీలు ఏం చేశారు అని అడిగితే బాగుండేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఎత్తులు వేసిన, ఎన్ని కుట్రలు పన్నినా వైసీపీ విజయాన్ని ఆపలేరు అని ధీమా వ్యక్తం చేశారు హఫీజ్ ఖాన్.