వైసీపీ ఎమ్మెల్యేలు కొన్ని కొన్ని విషయాల్లో మీడియాతో మాట్లాడే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ప్రధానంగా పార్టీలో ముందునుంచి ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు పార్టీకి సహకరించడం లేదు. ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అసలు మీడియాతో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గతంలో ఎక్కువగా మీడియాతో మాట్లాడే వారు.
తెలుగుదేశం పార్టీని ఆమె ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేయడం మనం చూసే వాళ్ళం. అయితే ఇప్పుడు ఆమె చాలా వరకు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. అలాగే మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడటం లేదు. ఈయనకు కూడా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం అప్పట్లో మనం చూశాం.
కానీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దగా మీడియాతో మాట్లాడటానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అసలు ఆయన మీడియా ముందుకు కనపడటానికి కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. కడప జిల్లాకు చెందిన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి కూడా పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు చేయకపోవడంతో వైసీపీ కార్యకర్తలకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యత తగ్గించారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే సైలెంటుగా ఉంటున్నారని వైసిపి వర్గాలు అంటున్నాయి. మీడియా ముందుకు వస్తారో లేదో చూడాలి.