తెదేపా, చంద్రబాబుకి వైసీపీ పెట్టిన కొత్త పేర్లు తెలుసా?

-

తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ అధినేతకి వైసీపీ నేత విజయసాయి రెడ్డి కొత్త పేరు పెట్టినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.  జగన్ పై దాడి తర్వాత మారుతున్న పరిణామాల కారణంగా.. కోడి కత్తి డ్రామా, ఆపరేషన్ గరుడ పేరుతో వైసీపీని అధికార పార్టీ టార్గెట్ చేయడంతో… అదే స్థాయిలో వైసీపీ గట్టి కౌంటర్ ఇస్తోంది. ఇందులో భాగంగా నేడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వరుస ట్వీట్లతో తెదేపా పై సెటైర్ల వర్షం కురిపించారు.

ట్వీట్ 1.   ‘చంద్రబాబు నాయుడు గారూ.. మా పార్టీని మీరు కోడి కత్తి పార్టీ అంటూ దిగజారి శునకానందం పొందుతున్నారు. కాబట్టి, ఇక మీదట మీ పార్టీని మేం శునకానందం పార్టీగా పిలుస్తాం. సరేనా?’అన్నారు.

ట్వీట్ 2. స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌)లు,కమిషన్‌లు చంద్రబాబు చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చే వ్యవస్థలన్నది బహిరంగ రస్యం.అవి బాబు ‘సిట్‌’ అంటే కూర్చుని,’స్టాండ్’ అంటే నిలబడి తమ వీరవిధేయతను ప్రకటిస్తాయి.సీఎంగా 14ఏళ్ళ హయాంలో బాబు వేసిన సిట్‌లు,విచారణలు ఉత్తిత్తివే అన్నది చారిత్రక సత్యం’అంటూ టార్గెట్ చేశారు.

ట్వీట్ 3. ఐటీ సోదాల నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు రాహుల్ తో పూసుకు తిరుగుతున్నాడు. జాతీయ స్థాయి లీడర్ నని ఐటి శాఖను బెదిరించాలని చూస్తున్నాడు. చిదంబరం, రాబర్ట్ వద్రాలే అక్రమ సంపాదన కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. రాహులేం కాపాడతాడు?’అని ప్రశ్నించారు.


రాహుల్ గాంధీ ఐటీ దాడుల నుంచి కాపాడలేడంటూ…చేసిన ట్వీట్ కి గాను సామాజిక మాధ్యామాల్లో వివిధ రకాల కాంమెట్స్ వస్తున్నాయి…ఇందులో ప్రధానంగా… ఎవరిని పట్టుకుంటే పని కరెక్టుగా జరుగుతుందో ..వైసీపీ ఎంపీకి భలే తెలిసింది..అంటూ వ్యాగ్యంగా కొంత మంది పోస్ట్ చేయడం గమనార్హం.
చిలికి చిలికి గాలి వానలా మారుతున్న మాటల యుద్ధం చివరి ఏ దారి తీస్తుందో అంటూ రాజకీయ పక్షాలు చర్చించుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version