చైనాకు మరో షాక్… యూఎస్ దారిలోనే ఆస్ట్రేలియా ఒలింపిక్స్ దౌత్యపర బహిష్కరణ

-

చైనాకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆదేశ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2022 లో చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ను ఇప్పటికే అగ్రరాజ్యం యూఎస్ఏ దౌత్యపరంగా బహిష్కరించింది. తాజాగా ఇదే దారిలో ఆస్ట్రేలియా చైనా వింటర్ ఒలింపిక్స్ ను దౌత్యపరంగా బహిష్కరించింది. చైనా మైనారిటీపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసగా… ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్స్ లో ఉయ్ గర్ ముస్లీంలను చైనా ప్రభుత్వం అణచివేస్తోంది. ఆదేశంలో మానవహక్కులను కాలరాస్తోంది. దీనికి నిరసగా యూఎస్ఏ, ఆస్ట్రేలియా దేశాలు చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ కు తమ అధికారులను పంపించడం లేదు. కేవలం క్రీడాకారులను మాత్రమే పంపనుంది. అధికారులను పంపించకుండా వింటర్ ఒలింపిక్స్ దౌత్యపరంగా బహిష్కరిస్తున్నాయి. 

అయితే అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అమెరికా తీరుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చైనా హెచ్చరిస్తోంది. అమెరికా దౌత్యపరమైన బహిష్కరణ క్రీడా స్పూర్తిని దెబ్బతిస్తుందని వ్యాఖ్యానిస్తోంది. మరోవైపు చైనా.. ఆస్ట్రేలియాలో గతం నుంచే ఘర్షణ పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఇటీవల కాలంలో దౌత్య సంబంధాలు క్షీణించాయి. అయితే ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై చైనా స్పందిస్తూ.. ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియా విజయం ఆ దేశ ఆటగాళ్ల పనితీరుపై ఆధారపడి ఉంటుందని.. ఆదేశ రాజకీయ నాయకులు, అధికారులపై ఆధాపడి ఉండదంటూ ఆస్ట్రేలియాకు కౌంటర్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news