సాధారణంగా నాలుక(Tongue) ని చూసి ఆరోగ్యం ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. కళ్లు, గోళ్లు కూడా ఆరోగ్యాన్ని సూచిస్తాయి. అయితే నాలుకపై ఉండే రంగుల మార్పులు వల్ల కూడా మనం ఆరోగ్యాన్ని చెప్పచ్చు.
అయితే మరి ఏ రంగు నాలుక ఎలాంటి సమస్యల్ని చెబుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మందులు వేసుకోవడం వల్ల లేదా ఆహార పదార్థాల కారణంగా నాలుక రంగు మారుతూ ఉంటుంది. అలానే అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తే నాలుక రంగు మారుతుంది.
మామూలుగా అయితే నాలుక గులాబీ రంగులో ఉంటుంది. అదే విధంగా కొద్దిగా తెలుపు రంగులో ఉండడం కూడా మంచిదే. అయితే ఏ రంగు నాలిక ఏ సమస్యలకు చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం.
తెలుపు నాలుక:
మీ నాలుక కనుక తెలుపు రంగులో ఉంటే అది ఓరల్ హైజీన్ ని పాటించకుండా ఉన్నట్లు అర్థం అదే విధంగా మీ బాడీ డీహైడ్రేషన్ కు గురి అవుతోంది అని అర్ధం. అదే ఒకవేళ మీ నాలుక చీజ్ లాగే ఉంటే leukoplakia ఉన్నట్లు. కొన్ని కొన్ని సార్లు జలుబు కారణంగా కూడా నాలుక తెల్లగా ఉంటుంది.
పసుపు నాలుక:
పోషక పదార్థాలు ఒంట్లో తక్కువగా ఉన్నప్పుడు నాలుక పసు పురంగులో ఉంటుంది. అజీర్తి సమస్యలు, లివర్ సమస్యలు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు ఏమైనా ఉంటే పసుపురంగులో ఉంటుంది.
బ్రౌన్ నాలుక:
కెఫిన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళ నాలుక బ్రౌన్ కలర్ లో ఉంటుంది. స్మోకింగ్ చేయడం వల్ల కూడా ఈ రంగులోకి మారిపోతుంది.
నలుపు నాలుక:
నాలుక నలుపు రంగులో వుంది అంటే ఎక్కువ ధూమపానం చేస్తున్నారని. లేదా క్యాన్సర్, అల్సర్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా నలుపు రంగులో ఉంటుంది. బ్యాక్టీరియా ఉండడం వల్ల కూడా నాలుక నలుపు రంగు లోకి వస్తుంది.
ఎరుపు నాలుక:
ఫోలిక్ యాసిడ్ లేదా B-12 లోపం ఉన్నప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది.
నీలం నాలుక:
హృదయ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు నీలం రంగులోకి మారుతుంది. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చెయ్యకపోయినా లేదా బ్లడ్ లో ఆక్సిజెన్ తగ్గిపోయినప్పుడు నీలం రంగులోకి మారుతుంది.