కొడాలి నాని పెద్ద మగాడా..? చంద్రబాబును ఏం చేస్తాడు : యరపతినేని

-

కొడాలి నాని పెద్ద మగాడా..? చంద్రబాబును ఏం చేస్తాడని యరపతినేని ఫైర్ అయ్యారు. కొడాలి, వంశీ, అంబటి, ద్వారంపూడి మాటలను.. వారి ఇంటి ఆడవాళ్లే అసహ్యించుకుంటున్నారని.. వైసీపీ నేతల్లా మేము మాట్లాడగలం.. కానీ మాఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకోరని పేర్కొన్నారు. చంద్రబాబు భద్రత తీసి వస్తే కొడాలి నాని ఏం చేస్తాడు..?అంటూ సవాల్ విసిరారు. సీఎం జగన్ అనుభవం ఎంత..? చంద్రబాబు అనుభవం ఎంత..? అంటూ ఎద్దేవా చేశారు యరపతినేని.

ప్రజలు వైసీపీని పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. వైసీపీకి ఘోరీ కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.రేపు అనేది ఒకటి ఉంటుంది అని వైసీపీ మర్చి పోయినట్లు ఉన్నారని.. ఈ రోజు నుంచి టీడీపీ కార్యకర్తలు అంత ఒక పట్టుదలగా పని చేసి వైసీపీని కూకటివేళ్ళతో పెకిలిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పల్నాడులో రోజు రోజుకి వైసీపీ నేతల ఆగడాలు పెరిగాయి.. ఈ రెండున్నారేళ్లుగా పల్నాడులో 80 మందికి పైగా టీడీపీ కార్యకర్తల కాళ్ళు చేతులు విరగొట్టి,7మందిని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. పిడుగురాళ్లలో సైదా అనే టీడీపీ కార్యకర్త అల్లా ని వేడుకుంటున్నా వైసీపీ నేతలు కొట్టారని.. ఏపీలో నియంత పాలన ఉందని నిప్పులు చెరిగారు యరపతినేని.

Read more RELATED
Recommended to you

Latest news