‘నారప్ప’ సినిమాలో వెంకీ స‌ర‌స‌న కొత్త హీరోయిన్‌.. ఎంత క్యూట్‌గా ఉందో..!

-

సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా `నారప్ప`. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ తెలుగులో వెంకటేష్ హీరోగా ‘నారప్ప’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ వర్షన్‌కి వెట్రిమారన్ దర్శకత్వం వహించగా, తెలుగు వర్షన్‌కి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని ‘రెడ్ డిసర్ట్’లో జరుగుతోంది. కీలకమైన కొన్ని పోరాట సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది.

ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది. మలయాళంలో ‘రెబా మోనికా జాన్’ కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ కానుంది. వెంకటేశ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఆమెపై చిత్రీకరించనున్నారు. చక్కని కనుముక్కుతీరు .. ఆకర్షణీయమైన రూపం రెబా సొంతం. ‘నారప్ప’ విజయవంతమైతే ఈ సుందరి ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగానే వున్నాయి. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news