బోర్డర్‌లో అద్భుతం.. 18 వేల అడుగుల ఎత్తులో…!

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో అద్భుత దృశ్యం అబ్బురపర్చింది. యోగా డే సందర్బంగా భారత సైనికులు బోర్డర్‌లో యోగా సాధన చేశారు. అయితే 18 వేల అడుగు ఎత్తులో పర్వతాలపై ఈ సాహసం చేశారు. చుట్టూ మంచు, రక్తం గడ్డే చలిగాలులు అయినా లెక్క చేయలేదు.

సోమవారం ఉదయం 6.30 గంటలకే యోగా డే‌లో పాల్గొన్నారు. గల్వానా, లద్దాఖ్ పరిసరాల్లో ఎప్పుడూ తుపాకులతో తిరిగే ఇండియన్ టిబెటిన్ బోర్డర్ సైనికులు యోగాలో పాల్గొని దేశానికి స్ఫూర్తి సందేశానిచ్చారు. భారతీయులందరూ యోగా చేయాలని సైనికులు పిలుపు నిచ్చారు. యోగాతో శారీరక, మానసిక దృడత్వాన్ని పొందచన్నారు.  సైనికులు సాహసయోగాసాలు చూసి ట్విట్టర్‌లో నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

ఇక దేశంలో యోగా డే ఘనంగా జరిగింది. ఎవరికి వారు ఇళ్లలో యోగాసనాలు వేసి ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు యోగా డేలో పాల్గొన్నారు.