ఉత్తరప్రదేశ్: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సాయం.. ఏకంగా 30లక్షలు.

-

కరోనా పరిస్థితులు ఎంత భయపెడుతున్నా అటు వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు తమ పనులను నిర్వర్తిస్తూనే ఉన్నారు. కరోనా వల్ల ఆగిపోయిన దేశాన్ని తమ భుజాలపై మోస్తూ ముందుకు నడిపిస్తున్నది వీళ్ళే అని చెప్పవచ్చు. ఐతే కరోనా వల్ల చాలామంది పోలీసులు, ప్రభుత్వ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలన్నది చాలామంది మాట. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది.

కరోనా సమయంలో జరిగిన ఎన్నికల్లో విధులు నిర్వర్తించి తమ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 30లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని యోగీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో పంచాయితీ ఎన్నికల సమయంలో పనిచేసిన 2వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. మరోవైపు పరిహారం కోసం 3078దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం 11లక్షల మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news