విదిషా ఉదంతం.. దుఃఖించిన ప్రధాని.. నష్టపరిహారంగా 2లక్షలు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషా జిల్లాలో జరిగిన సంఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 40అడుగుల లోతు బావిలో 40మందికి పైగా పడిపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వెలిబుచ్చారు. బావిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలకు 2లక్షల నష్టపరిహారం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు బావిలో నుండి నలుగురిని బయటకు తీసారు.

ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 10ఏళ్ల బాలుడు బావిలో పడడంతో అతన్ని కాపాడే పనిలో ఉన్నప్పుడు, ఆ బావి గోడకు ఆనుకుని ఉన్న 40మంది అందులో పడ్డారు. అందరి బరువు గోడమీద పడడంతో ఆది కూలిపోయి ప్రమాదం సంభవించింది. మృతుల కుటుంబాలకు 5లక్షల రూపాయలను, గాయపడ్డ వారికి 50వేల రూపాయలు పరిహారంగా ఇస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.