యోగీ సర్కార్ బుల్డోజర్ యాక్షన్ ఆపాలని సుప్రీంకు జమియత్ ఉలేమా-ఎ-హింద్

-

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో దేశంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముస్లింలు తన నిరసనను, ఆందోళనను తెలియజేశారు. అయితే బెంగాల్ హౌరా, జార్ఖండ్ రాంచీ, యూపీలోని కాన్పూర్, ప్రయాగ్ రాజ్, సహరాన్ పూర్ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో యోగీ ప్రభుత్వం అల్లర్లకు పాల్పడిన వారిని ఉక్కు పాదాలతో అణచివేస్తోంది. ముఖ్యంగా నిందితుల అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తోంది యోగీ సర్కార్.

 

 

తాజాగా జమియత్ ఉలేమా-ఏ- హింద్ ఈ కూల్చివేతలపై సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. నేర విచారణలో నిందితులుగా ఉన్న వారి నివసాలను, వాణిజ్య ఆస్తులపై బుల్డోజ్ చేయడాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలు చట్టాలకు అనుగుణంగా నిర్వహించేలా యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంని కోరింది. ఇదిలా ఉంటే యూపీ సర్కార్ అల్లర్లకు పాల్పడి శాంతి భద్రతలకు భగం వాటిల్లేలా చేసిన 200పైగా నిందితులను అరెస్ట్ చేసింది. కీలక సూత్రధారులుగా ఉన్న వారిని శిక్షిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news