దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ సర్వీసులతో కస్టమర్లకు పని సులభంగా అయ్యిపోతుంది. అయితే స్టేట్ బ్యాంక్ అందించే సేవలలో యోనో కూడా ఒకటి. యోనో యాప్ ద్వారా చక్కటి సేవలను పొందొచ్చు.
కొన్ని సెకన్లు లేదా నిమిషాల్లో ఆర్థిక సేవలు, మరెన్నో సౌకర్యాలను ఈ యాప్ ని ఉపయోగించుకుని పొందొచ్చు. యోనో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని సులభంగా సేవలను పొందొచ్చు. ఫోన్ లో ఈజీగా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేరు, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి మీ ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. SBI YONO యాప్‌ని ఎప్పుడు ఓపెన్ చేసినా సరే పేరు, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చెయ్యాలి. లాగిన్ పాస్‌వర్డ్ లేదా వినియోగదారు పేరును కనుక మరచిపోతే ఇలా చెయ్యండి. అప్పుడు యోనో యాప్ ని ఉపయోగించుకోవచ్చు. ఇక పాస్వర్డ్ ని మరచిపోతే ఎలా మళ్ళీ పొందచ్చనేది చూద్దాం.
దీని కోసం మొదట మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా onlinesbi.com అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చెయ్యండి.
తరవాత మీరు పర్సనల్ బ్యాంకింగ్ ఆప్షన్ వద్ద నుండే లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ డీటెయిల్స్ ని అడుగుతుంది.’
యూజర్ నేమ్ / ఫర్గాట్ లాగిన్ పాస్‌వర్డ్ పైన నొక్కండి.
ఓ పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
డ్రాప్-డౌన్ మెను నుండి ఫర్‌గిట్ పాస్‌వర్డ్ మీద ఇప్పుడు నొక్కండి.
సీఐఎఫ్ నంబర్, దేశం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, INB రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వుంది.
ఫైనల్ గా సబ్మిట్ చెయ్యండి.
ఓటీపీ ని ఎంటర్ చెయ్యండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. అలానే స్క్రీన్ మీద కూడా కనపడుతుంది.