పుదీనాను పండించి చక్కగా ఇలా లాభాలను పొందొచ్చు…!

-

ఈ మధ్యకాలం లో చాలా మంది వ్యవసాయం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. పైగా మంచిగా లాభాలు కూడా వస్తున్నాయి. వాణిజ్య పంటల్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈ సమస్యల వలన ఆర్థిక నష్టాలు ఎక్కువగా రైతులకు ఎదురవుతున్నాయి. అయితే ఈ క్రమం లో రాష్ట్ర ప్రభుత్వ పిలుపు వలన ప్రత్యామ్నాయ పంటల మీద ఆసక్తి చూపడం జరుగుతోంది. ఎక్కువ డబ్బులు పొందడానికి చూస్తున్నారు. అయితే అన్నదాతలు కేవలం కొద్ది భూమిలో సాగు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

పుదీనా సాగు చేస్తే మంచిగా డబ్బులు పొందడానికి అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… 32 మడులను అర ఎకరం లో ఒక రైతు పుదీనా సాగు చేయడం మొదలు పెట్టారు. రోజుకొకటి చొప్పున కోసి 700 కట్టలు కట్టి మార్కెట్లోకి పంపిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల రోజుకు 600 నుంచి 700 వరకు వస్తున్నాయి.

ఈ సాగు చేయడానికి కల్టివేటర్ తో కలియదున్నాలి. అదే విధంగా దుక్కి దున్నేటప్పుడు డీఏపీ నాలుగు ట్రాక్టర్ల ఎరువు వేస్తె మంచిది. 32 మడులను అర ఎకరం లో ఏర్పాటు చేయగా 45 రోజులకు పంట కోతకు రావడం జరిగింది.

నిజానికి ఒక సారి పుదీనా మొక్కలు నాటితే రెండేళ్ల వరకు పుదీనా పంట ఆదాయం వస్తుంది. ఏడాదికి ఎనిమిది సార్లు పుదీనా కోయచ్చు. ఈ విధంగా వ్యవసాయం చేయడం వల్ల 15 వేల వరకూ వస్తాయి. 15 రోజులకు ఒకసారి పిచికారి చేస్తే చీడపీడల సమస్యలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news