‘నన్ను కొట్టి పొలిమేర కూడా దాటలేరు’.. ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్!

-

ఫ్యాక్షన్ సినిమాల్లో డైలాగులు వింటే సినిమాల్లో విజిల్స్ సౌండ్ ఓ రేంజ్‌లో వినిపిస్తాయి. కానీ రియల్ లైఫ్‌లో అలాంటి డైలాగులు వినడం చాలా రేర్. గుడ్డలూడదీసి కొడతా.. నన్ను కొట్టి మేలిమేర కూడా దాటలేవు.. ఇలాంటి డైలాగులు సినిమాల్లోనే వింటుంటాం. అయితే రాయలసీమలో ఓ ఎమ్మెల్యే సినిమా డైలాగులను తలదన్నేలా పంచ్ డైలాగ్‌లు వేశారు. నువ్వో.. నేనో.. తేల్చుకుందామని సవాల్ విసిరారు. దీంతో వైసీపీ ప్లీనరీలో హీటెక్కింది.

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి

ధర్మవరం పాలిటిక్స్ ఎంత గరం గరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి ఈ సారి రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్య నారాయణతోపాటు ఆయన వర్గానికి చెందిన వారు కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పుడు బీజేపీలో ఉన్నావ్.. టీడీపీలోకి వెళ్లానని ప్రచారం చేసుకుంటున్నావ్.. టీడీపీలోకి వస్తే ధర్మవరం నడిబొడ్డున గుడ్డలూడదీసి కొడతా.. నా కాళ్లూ, చేతులు విరిచేస్తామని అంటున్నారు.. దమ్ముంటే నన్ను కొట్టి పొరిమేర దాటు.’ అని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news