పీసీసీసీ ఛీఫ్ ఎవరో తేలిపోయింది.. భారీ ఎత్తున ఇంటికి చేరుకుంటున్న అభిమానులు !

Join Our COmmunity

గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త పీసీసీ చీఫ్ కోసం అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. పీసీసీ చీఫ్‌ ఎవరనే దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దానికి అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. నిజానికి ఏఐసీసీ వారం క్రితమే జీవన్‌రెడ్డిని ఢిల్లీకి పిలిచి మాట్లాడింది. ఆ తర్వాత ఆయనకు సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ ఇచ్చినా పని చేయటానికి సిద్ధంగా ఉండాలని జీవన్‌ రెడ్డికి సూచించినట్లు సమాచారం.

దీనికి సంబంధించి ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక జీవన్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడుగా ఖరారు కానున్న నేపథ్యంలో ఆయన నివాసానికి భారీ ఎత్తున కార్యకర్తలు, అనుచరులు చేరుకుంటున్నారు. సంబరాలు చేసేందుకు జీవన్ రెడ్డి అనుచరులు,అభిమానులు సిద్డం అవుతున్నారు. మరో పక్క పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. చివరి దాకా పీసీసీ రేసులో ఉన్న రేవంత్‌ కు ప్రచారకమిటీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అందుకే ఆయన వ్యూహాత్మకంగా నిన్న ఒక ఇంటర్వ్యూలో ఈ మేరకు కామెంట్స్ చేశారని అంటున్నారు. 

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news