అలర్ట్‌ : డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న మంకీపాక్స్‌..

-

‘మంకీపాక్స్’ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో మొదలైన కేసుల ప్రవాహం నెమ్మదిగా అన్ని దేశాలను చుట్టేస్తోంది. ఆదివారం నాటికి 12 దేశాలకు ఈ వైరస్ పాకింది. మొత్తంగా 180 కేసులు నమోదు కాగా.. యూరప్‌లోని 9 దేశాల్లో 100కుపైగా కేసులు నమోదయ్యాయి. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్, యూకే దేశాల్లో మంకీ పాక్స్‌ కేసులు నమోదవుతున్నాయి.

- Advertisement -

WHO alerts nations as more monkeypox cases reported in Britain

మరోవైపు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగుచూసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైంది భారత ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మశూచికి కారణమయ్యే వారియెలా వైరస్ కుటుంబానికి చెందిన ఈ మంకీపాక్స్ సోకితే పొక్కులు, జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, లింఫ్ గ్రంథుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...