ఐసీయూలో ఉన్న యువతిపై దారుణం..యువతిపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారం!

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది..కామంతో కళ్లు మూసుకుపోయిన కామంధులు రెచ్చిపోతున్నారు..రోజుకొక అత్యాచార ఘటన వెలుగు చూస్తున్నాయి..తాజాగా గురుగ్రామ్‌లో మరో ఘటన వెలుగులోకివ‌చ్చింది.. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్న యువ‌తిపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.. వెంటీలేట‌ర్‌పై స్పృహ‌లో లేని స‌మ‌యంలో కామాంధుడు త‌న ‌వాంఛ తీర్చుకున్న దారుణ ఘటన ఢిల్లీ శివార్ల‌లోని గురుగ్రామ్‌లో వెలుగులోకివ‌చ్చింది.క్ష‌య‌వాధి చికిత్స కోసం ఈనెల 21న యువతి గురుగ్రామ్‌లోని 44వ సెక్టార్‌లో ఉన్న ఫోర్టీస్ ఆస్పత్రిలో చేరింది.. ఆమెకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోని ప్రైవేట్ గ‌దిలో వెంటీలేట‌ర్‌పై చికిత్సం అందిస్తున్నారు..కాగా, తాను స్పృహ లేనిస్థితిలో ఉన్న‌ప్పుడు ద‌వాఖాన ఉద్యోగి ఒకరు తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు తెలిపింది.. త‌న తండ్రి ఆమెను చూడ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు చేత్తో రాసిన నోట్ ద్వారా వెల్ల‌డించింది. స్పృహలోకి వచ్చాక బాధిత యువతి సంఘటన గురించి చెప్పిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై సుశాంత్ లోక్ పోలీసులు కేసు నమోదు చేశార‌ని, నిందితుడిని గుర్తించామని చెప్పారు. ఆమెపై అఘాయిత్యానికి ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అని వెల్ల‌డించారు..మరింత సమాచారం కోసం హాస్పిట‌ల్‌ ఉద్యోగులను ప్రశ్నిస్తున్నామని తెలిపారు.