అధికార పార్టీలో నేతలను కట్టుదిట్టం చేయాలనే జగన్ ఆలోచన మంచిదే అయినా.. నేతలకు ఉన్న అభి ప్రాయాలను అంతర్గతంగా అయినా పంచుకునేందుకు అవకాశం లేకుండా పోవడంతో నాయకులు తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎవరూ అనుమతి లేకుండా మీడియా ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవడం, ఇంచార్జులు కూడా అందుబాటులో ఉండకపోవడంతో చాలా మంది నాయకులు తమ అభి ప్రాయాలను తమకు అత్యంత నమ్మకమైన అనుచరులతోనే పంచుకుంటున్నారు.
ఇలా పంచుకుంటు న్న విషయాల్లో కొన్ని కీలకమైన అంశాలు అడపా దడపా బయటకు వస్తున్నాయి.
ఇలా.,.. అత్యంత రహస్యంగా లీకైన వ్యవహారం ఒకటి ఆసక్తిగా మారింది. అదే.. ఇటీవల మంత్రి కొడాలి నా ని, టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి మద్దతు పలికిన వల్లభనేని వంశీ వ్యవహారం. ఈ ఇద్దరూ కూడా ఇటీ వల టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, ఆయన కుమారుడు లోకేష్‌పైనా విరుచుకుపడ్డారు.
అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఈ ఇద్దరూ కూడా సమర్ధించారు. ఒకానొక ఇంటర్వ్యూలో వంశీ.. ఏకంగా టీడీపీ పగ్గాలు జూనియర్ తీసుకుంటే.. మీరు ఆ పార్టీలోకి జంప్ చేస్తారా? అన్న ప్రశ్నకు.. అప్పుడు ఆలోచిద్దాం.. అంటూ దాటవేశారు. దీంతో ఈ విషయాలు ఆసక్తిగా మారాయి. అయితే, వైసీపీ నేతల ఆలోచన, చర్చ వేరుగా ఉన్నాయి. ఈ ఇద్దరు నాయకులు వైసీపీ మద్దతుగా మాట్లాడారు సరే! అయితే, అదేసమయంలో టీడీపీని ఇలా దూ షించడం ఏ మేరకు సమంజసం.
రేపు మన పార్టీని, మన నాయకుడిని కూడా ఇలానే దూషించరనే గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు ఇలా అంటున్నవారే..రేపు పరిస్థితి మారితే.. మన పార్టీని కూడా దూషించరా? అని నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. పోనీ.. ఈ విషయాన్ని జిల్లా ఇంచార్జ్ మంత్రులకు చెపుదామని అనుకున్నా.. ఈ ఇద్దరు నేతలు వైసీపీ అధినేత జగన్‌కు తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి.. వారి గురించి ఎవరికి ఫిర్యాదు చేసినా.. ఏంటి ప్రయోజనం? అనే కంక్లూజన్‌కు వస్తున్నారు.
అయితే, ఇలాంటి వారిలో ఆది నుంచి వైసీపీలో ఉన్న నాయకులే కావడం గమనార్హం. మొత్తానికి వంశీ, కొడాలి వ్యవహారం ప్రతిపక్షం టీడీపీలో ఎంత కలవరం పుట్టిస్తోంది. దీనికి కొంచెం తక్కువగానే అయినా వైసీపీలోనూ అంతే కలవరం పుట్టిస్తోందన్నమాట!