అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరును మినహాయించాలని కోరుతూ తాను దాఖలుచేసిన పిటిషన్ను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం నాడు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు హైకోర్టు వాయిదా వేసింది. . అయితే దీనిపై ఈ రోజు వాదనలు జరిగాయి.
అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు మరింత గడువును కోరారు. దీంతో జగన్ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలని కోరుతూ జగన్ ఈ పిటిషన్ వేశారు. కాగా.. గత శుక్రవారం మినహాయింపును కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాలపై జగన్ హైకోర్టులో అప్పీలు చేశారు.