రాష్ట్రంలో అనూహ్యంగా సీఎం జగన్ ఓ కీలకమైన పథకాన్ని తెరమీదికి తెచ్చారు. రాష్ట్రంలోని 8 లక్షల పై చిలుకు ఉన్న డ్వాక్రా మహిళా సంఘాలకు జీరో వడ్డీ కింద 1400 కోట్లు అప్పుగా ఇవ్వనున్నారు. కేవలం ఒ క్క బటన్ నొక్కడంతో ఆయా సంఘాల ఖాతాల్లోకి నిధులు వెళ్లనున్నాయి. ఫలితంగా 90 లక్షల పైచిలుకు మహిళలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, సీఎంజగన్‌కు వచ్చే రేటింగ్ ఎంత? అనే చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతుండడం గమనార్హం. మహిళలకు నిధులు ఇవ్వడం అనేది గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా చేసింది.
సన్నా వడ్డీకి రుణాలు ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బాబు కూడా తొలి విడదల 2015-16లో విడుదల చేశారు. తర్వాత మాత్రం ఆయన ఈ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారు. ఇక, ఎన్నిక ల సమయంలో పసుపు-కుంకుమ అనే పేరుతో రూ. 10 వేల చొప్పున మహిళలకు విడతల వారీగా ఇచ్చా రు. అయితే, ఇప్పుడు జగన్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు జీరో వడ్డీకే రుణాలు ఇస్తున్నా రు. అయితే, దీనికి ప్రత్యేకత ఉండడం గమనార్హం. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో ఆదాయం భారీగా తగ్గిపోయింది.
కీలకమైన రవాణా రంగం.. ఎక్సైజ్ రంగాల నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం కొరవడింది. మరోపక్క, కరోనా కారణంగా చేపడుతున్న రక్షణ చర్యలు, పేదలకు పంచిన రూ.1000, రెండు సార్లు రేషన్ వంటి కార్యక్రమాలు ప్రభుత్వంపై భారం మోపాయి. అయినా కూడా జగన్ తాను ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం లోని మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ పథకం కింద లబ్ఢి పొందుతున్న మహిళలు.. కష్టకాలంలో తమకు జగన్ అండగా నిలిచారనే వ్యాఖ్యలు చేస్తున్నారు.
దీంతో ఈ పథకం ద్వారా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం కంటే కూడా ఎక్కువగానే రీచ్ అయిందని, రేటింగ్ కూడా అదిరిపోతోందని అంటున్నారు వైసీపీ నాయకులు. గతంలో అంటే ఈ ఏడాది జనవరిలో అమ్మ ఒడి పథకం కింద ఇచ్చిన నిధులు కూడా ప్రజలకు సంక్రాంతి సమయంలో అందడంలో పూర్తిగా సద్వినియోగం కావడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం కావడం గమనార్హం.