మామూలు వ్యూహం కాదిది… కులం టాపిక్ ఒక్కరోజులోనే ముగిసింది!

-

ప్రభుత్వ పరంగా ఎన్ని పనులు చేస్తున్నా.. పార్టీ పరంగా, రాజకీయాలపరంగా వైకాపా అధినేత భారీ జాగ్రత్తలే తీసుకుంటున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ చేస్తున్న పనులు, వేస్తున్న ప్లాన్లు, పెంచుతున్న అంచనాలు, ఇస్తున్న షాక్ లు సర్ ప్రైజ్ లు మామూలుగా లేవనే అనుకోవాలి! అసెంబ్లీ సమావేశాల ముందు ఏదో కేబినెట్ మీటింగ్… అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలి అని పెట్టుకుని ఉంటారు అని అంతా అనుకుంటున్న దశలో… సీబీఐ కి అప్పగిస్తూ రెండు విషయాలు తెరపైకి తీసుకొచ్చారు. ఇది చాలా దూరం వెళ్తుంది అని అదే ఆలోచనలో, అదే చర్చల్లో ఉండగా… అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు.

దీంతో బాబు బీసీ కార్డు తీయడంతో… నెక్స్ట్ కచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిపైనే చర్యలు ఉండొచ్చని, జగన్ దగ్గర ఉన్న లిస్ట్ లోంచి ఒక ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఫైల్ ఒకటి బయటకు వస్తుందని అంతా ఆలోచించారు. ఇందులో దేవినేని ఉమ, ప్రతీపాటి పుల్లారావు వంటి పేర్లు ఆన్ లైన్ లో హల్ చల్ చేసాయి. కానీ… ఎవ్వరూ ఊహించని రీతిలో జేసీ బ్రదర్స్ ని టార్గెట్ చేశారు! జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి లను పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, అనంతపురం తరలించారు. తప్పు చేసిన వారిని తప్పుచేసినవారిగానే చూస్తాము తప్ప… వారిలో కులాలను, మతాలను చూడమని… జగన్ సర్కార్ చెప్పకనే చెప్పినట్లయ్యింది.

జగన్ పేరు చివర రెడ్డి ఉందని, జేసీ ప్రభాకర్‌ పేరు చివర రెడ్డి ఉందని.. జగన్ సర్కార్ వెనక్కి తగ్గలేదు.. అచ్చెన్న పేరు చివర రెడ్డి లేదని అరెస్టు చేయలేదు! ఇక్కడ ఒకటే ప్రాతిపదిక… తప్పు చేశారా లేదా అన్నది మాత్రమే! ఈ విషయాన్ని రెండు రోజుల్లోనే జగన్ మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించారనే అనుకోవాలి. ఈ క్రమంలో అచ్చెన్న అరెస్టు అనంతరం బాబు రాజకీయ స్వార్ధంతో తీసిన బీసీ కార్డు ఒక్క రోజులోనే కాలగర్భంలో కలిసిపోయిందనే చెప్పాలి.

అచ్చెన్న అరెస్టు అనంతరం టీడీపీ నేతలంతా కరోనాను పక్కన పెట్టి రోడ్లపైకి వచ్చి నానా హడావిడి చేశారు. బాబు కూడా… బీసీలంతా రోడ్లపైకి రావాలి.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేలా నినాదాలు చేయాలి అని హడావిడి చేశారు. కానీ… టీడీపీ శ్రేణులు బయటకు వచ్చాయి తప్ప.. గతం గుర్తున్న బీసీలు బయటకు పెద్దగా రాలేదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దీంతో… ఇప్పుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్టు చేయడంతో… కులం అనే టాపిక్ ని, రాజకీయ అవసరాలకు కులం కార్డు వాడే ఆలోచనలను జగన్ ఒక్కరోజులోనే చంపేశారని… తనకు కులమత బేధాలు ఉండవన్న విషయం మరోసారి రుజువుచేశారని కామెంట్లు పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news