ఏ ప్రభుత్వానికైనా తాము తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలు జరగాలనే ఆశ, అభిలాష ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే.. ప్రజలు తమకు ఏరికోరి అధికారం ఇచ్చారు కాబట్టి.. ప్రజలకు తాము ఏదైనా న్యాయం చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ది పథం లో ముందుకు నడిపించాలని ఆశ ఉంటుంది. కానీ, అడుగడుగునా ఆటంకాలు ఎదురైతే.. అన్ని విషయాల్లోనూ ప్రధాన ప్రతిపక్షా లు అడ్డు తగిలితే ? ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే కదా.. తెలంగాణ కేసీఆర్ తన ప్రభుత్వాన్ని ముందుగానే రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లారు! ఇక, ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాం. వైసీపీ కానీ, జగన్ కానీ అధికారంలోకి రాకూడదనే గట్టినిర్ణయంతో ఇక్కడి ప్రధాన పార్టీ టీడీపీ ఉంది.
ఈ క్రమంలోనే గత ఏడాది ఎన్నికలకు ముందు ప్రజలకు తాయిలాలు పంచింది. అయినా కూడా ప్రజలు టీడీపీని తిరస్కరించా రు. భారీ మెజారిటీతో కనీవినీ ఎరుగని సంఖ్యా బలంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు.. వైసీపీకి పాలన చేతకాదనే ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ ఆయన తప్పుబడుతూ వచ్చారు. అయితే, అసెంబ్లీలో తమకు బలం లేకపోవడంతో మండలి ని ఆయుధంగా వాడుకున్నారు. శాసన మండలిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉన్నందున అక్కడ జగన్ నిర్ణయాలను అడ్డుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు , సీఆర్ డీఏ రద్దు బిల్లులను మండలిలో టీడీపీ రాజకీయం సృష్టించి నిలిపేసింది. ఫలి తంగా చిర్రెత్తుకొచ్చిన జగన్ అసలు మండలి అవసరమా? అంటూ.. మండలి రద్దుకు అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. అయితే, ఇది పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పటికే ఈ తీర్మానం కేంద్ర హోం శాఖకు చేరి మూడు మాసాలైంది. తీర్మానం కేంద్రానికి చేరిన తర్వాత పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమయంలోనే తీర్మానం ఆమోదం పొందుతుందని జగన్ టీం భావించింది. కానీ, అలా జరగలేదు.
ఇక కరోనా నేపథ్యంలో ఇప్పట్లో పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీంతో జగన్ ఆశలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఇదిలావుంటే, తాజాగా మండలిలో ఖాళీ అయిన ఒక స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం కావడం జగన్ ఆశలపై నీళ్లు కుమ్మరించి నట్టు అయింది. మరి ఎప్పటికి మండలి రద్దవుతుందో చూడాలి.