ఇన్ డైరెక్ట్ గా జగన్ కి పక్కలో బల్లెం లా మారుతున్నారా ?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి కరోనా వైరస్ తెచ్చిపెడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అసలే ఆర్థికంగా నష్టపోయి ఉండటంతో కరోనా వైరస్ ఎఫెక్ట్ చాలా గట్టిగానే తగిలిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవటంతో కొద్దో గొప్పో వచ్చే రాష్ట్ర ఆదాయం కూడా మొత్తానికి పడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. ఇందుమూలంగానే రెండు విడుతలలో జీతం చెల్లించిన అన్నట్లు జగన్ ఇటీవల చెప్పడం జరిగింది. పరిపాలనలో ఈ విధంగా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్న జగన్ కి సొంత పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లు, అత్యుత్సాహం మాటలు పక్కలో బల్లెంలా మారుతున్నాయి.Free medical treatment for those up to earning ₹5 lakh in AP ...భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కారు ప్రతి ప్రభుత్వ భవనానికి వైసీపీ పార్టీ రంగు వెయ్యాలని సలహాదారులు ఇచ్చిన ఆలోచన ఇప్పుడు ఆ పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చింది. స్వయంగా కోర్టు మొట్టికాయలు వేయడంతో ఈ విషయంలో జగన్ పరువు పోయినట్లు అయింది. నిజానికి పంచాయ‌తీ భ‌వ‌నాలు.. ప్రభుత్వ కార్యాల‌యాల‌కు పార్టీ రంగులు వేయ‌డం స‌రికాద‌ని గ‌తంలో రెండున్నరేళ్ల కింద‌టే సుప్రీం కోర్టు స్వయంగా ఓ కేసులో వెల్లడించింది.

 

అయినా కానీ వైసీపీ పార్టీలో కొంతమంది అత్యుత్సాహం నాయకులు ఇచ్చిన సలహాలు జగన్ ప్రభుత్వం మెడ‌కు ఉచ్చు బిగించి నట్లయింది. ఇదే సమయంలో కరోనా వైరస్ విషయంలో వైసిపి నాయకులు ఇష్టానుసారంగా నోరు జారటం తో … చేస్తున్న కామెంట్లు కూడా జగన్ ని అడగటం లో పడేస్తున్నాయి. స్వయంగా ఒక నాయకుడు రాష్ట్రంలో కరోనా వైరస్ ఈ విధంగా విజృంభించడానికి ఒక వర్గానికి చెందిన ప్రజలు అంటూ… మీడియా ముందు మాట్లాడటంతో.. ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఇప్పుడు వైసీపీ పార్టీ అంటేనే అసహ్య పడుతున్నారు. మొత్తం మీద సలహాలు సొంత నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఇండైరెక్టుగా జగన్ కి బాగా డ్యామేజ్ తెచ్చి పెడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news