దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన కుమార్తె వైయస్ షర్మిల మరియు ఆయన సతీమణి విజయమ్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కడప జిల్లాలోని ఇడుపుల పాయ లో దివంగత మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఇవాళ వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, వైఎస్ విజయమ్మ నివాళులు అర్పించారు.
రేపటి నుంచి ప్రజా ప్రస్థానం పేరు తో తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించబోయే ముందు తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు వైఎస్ షర్మిల.. ఆమె తో పాటు నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్ టీపీ తెలంగాణ నేతలు, వైఎస్ కుటుంబ అభిమానులు ఉన్నారు… అయితే ఇడుపులపాయ తండ్రి వైఎస్ ఘాట్ వద్ద ప్రార్ధనల సమయంలో… భావోద్వేగానికి గురైయ్యారు షర్మిళ.
అంతే కాదు తల్లి, కుమార్తె విజయమ్మ, షర్మిళ లు కన్నీటి పర్వతమయ్యారు. కాగా చేవెళ్ళలో రేపు ఉదయం 11 గంటలకు షర్మిల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు వైఎస్ షర్మిల. 14 నెలలు, 4 వేల కిలో మీటర్లు, 90 నియోజక వర్గాల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల.