ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఈరోజు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధర్నా చేపడుతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పై విచారణకు డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు వైయస్ షర్మిల. తెలంగాణలో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, వైయస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటిని కాలేశ్వరం లెక్కల్లో చూపిస్తున్నారని, దీనిపై విచారణ జరపాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఈరోజు షర్మిల పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టేందుకు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టారు.
పార్టీ నేతలతో కలిసి నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయని, ఈ ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్పారు. అయినా షర్మిల ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆమెతోపాటు, వైయస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పార్లమెంట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.