టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

-

టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితులను మరికొద్ది సేపట్లో బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ కి తరలించనున్నారు పోలీసులు. రిమాండ్ అనంతరం కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు పోలీసులు. నిందితుడు ప్రవీణ్ స్త్రీలోలుడిగా తెల్చారు పోలీసులు.

2017లో టీఎస్పీఎస్సీ లో జూనియర్ అసిస్టెంట్ గా చేరాడు ప్రవీణ్. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్ లో పనిచేశాడు. వెరిఫికేషన్ సెక్షన్ కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకున్న ప్రవీణ్.. దరఖాస్తు సందర్భంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించి మహిళలతో సాన్నిహిత్యం పెంచుకునేవాడు. ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు గుర్తించారు పోలీసులు. వాట్సప్ చాటింగ్ లోనూ మహిళల నగ్న ఫోటోలు దృశ్యాలను గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని తేల్చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news