రైతుల పాలిట.. కేసీఆర్ ఓ ఊసరవెళ్లి : వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్ర రైతుల పాలిట సీఎం కేసీఆర్ ఓ ఊసరవెళ్లి అని నిప్పులు చెరిగారు వైఎస్ ష‌ర్మిల‌. ఇవాళ చేప‌ట్టిన‌ రైతు ఆవేద‌న యాత్ర లో భాగంగా… మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్న మరొక రైతు గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు వైఎస్ ష‌ర్మిల‌. ఈ సంద‌ర్భంగా వైఎస్ ష‌ర్మిల మాట్లాడుతూ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఈ రైతు కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని…సర్కారు తరఫున ఏ ఒక్కరూ పరామర్శించలేదని మండిప‌డ్డారు.

Sharmila
Sharmila

టీఆర్ ఎస్‌ ప్రభుత్వం రైతు హంతక ప్రభుత్వమ‌ని ఆగ్ర‌హించారు. ఓసారి సన్నొడ్లు వేయమంటారని.. మరోసారి మేమే వడ్లు కొంటామంటార‌ని నిప్పులు చెరిగారు. ఇంకోసారి వరి కొనబోము అంటారని..కేసీఆర్ పై చిందులు వేశారు. వరి వేయొద్దనే అధికారం కేసీఆర్ కు ఎక్కడిది? రైతుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చలగాటం ఆడుతుంద‌ని నిప్పులు చెరిగారు. అన్నదాతల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమ‌ని ఫైర్ అయ్యారు.