BREAKING : బెలగావి ఎక్స్‌ప్రెస్​కు బాంబు బెదిరింపు

-

బెలగావి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్లాల్సిన ఈ రైల్లో బాంబు ఉందంటూ ఫోను రావడంతో రైల్వే సిబ్బంది ఉలిక్కి పడ్డారు. బుధవారం రాత్రి 9.30 గంటలకు ఫోను రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమైంది. హుటాహుటిన డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. రాత్రి 11.15 గంటల వరకూ పరిశీలించి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

వాస్తవానికి ఈ 07335/36 నంబరు గల రైలు రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా దేవరంపల్లి గ్రామస్థుడు బాలరాజు ఆటో డ్రైవర్‌. ఆ దగ్గరలోని పోలీసు స్టేషన్‌ సమీపంలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటూ.. రైలులో బాంబు ఉందంటూ మాట్లాడుకుంటుండగా.. బాలరాజు విని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాత్రి 11.36 గంటల సమయంలో రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లింది. బాలరాజును విచారిస్తామని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news