కడప : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సనగతి తెలిసిందే. అయితే తాజాగా ఈరోజు ఈ కేసు లో సీబిఐ ముఖ్య వ్యక్తులను విచారించింది.. పులివెందుల్లో ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి పెద్దనాన్నలు వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి లను సీబిఐ బృందం విచారించింది. ఇరువురి వైఎస్ సోదరుల ను 3 గంటలు పాటు విచారిం చారు సిబిఐ అధికారులు.
సీబిఐ కష్టడి లో వున్న సునీల్ కుమార్ యాదవ్ కష్టడి ఈ రోజుతో ముగియడంతో.. సునీ ల్ ను సీబిఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. అయితే సునీల్ యాదవ్ ను మరోసారి కష్టడి కి ఇవ్వాలని సిబిఐ కోరగా.. దీనికి కోర్టు నిరాక రించింది. పులి వెందుల కోర్టు సునీల్ యాదవ్ కు 14 రోజులు రిమాండు పొడిగించింది. దీంతో సునీల్ యాదవ్ ను సీబిఐ కడప సెంట్రల్ జై లుకు తరలించారు.