వైఎస్ వివేకా హత్య కేసు.. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ వాయిదా

-

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే గంగిరెడ్డి బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ఉందని సిబిఐ ఆరోపిస్తుంది. వాదనలు విన్న హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు పై సిబిఐ పిటిషన్ విచారాణని ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.

ఈ ఏడాది జనవరి నెలలో సుప్రీంకోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ని తెలంగాణకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. గంగిరెడ్డి బెయిల్ రద్దు పై తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుందని జస్టిస్ ఎం ఆర్ షా నేతృత్వంలోని ధర్మసనం పేర్కొంది. గతంలో బెయిల్ మంజూరు చేసినప్పుడు కింద స్థాయి కోర్టు మెరిట్ ని పరిగణలోకి తీసుకోలేదని.. ఈ అంశంలో విచారణ జరిపి, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం బెయిల్ రద్దు పై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకి సుప్రీం ధర్మాసనం సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news