వైఎస్సార్ భీమా స్కీమ్.. విధి విధానాలివే !

-

వైఎస్సార్ బీమా స్కీమ్ విధి విధానాలను ప్రభుత్వం రూపకల్పన చేసింది. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి వైఎస్సార్ బీమా స్కీమ్ వర్తించనుంది. కుటుంబ పెద్ద ప్రమాదంలో లేదా సహజ మరణం చెందితే భీమా వర్తిస్తుందని తెలిపింది. ప్రమాదంలో పూర్తి స్థాయిలో అంగవికులురైన వారికీ వైఎస్సార్ బీమా వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారు ప్రమాదంలో చనిపోయినా లేదా అంగవికులురైనా 5 లక్షల బీమా సౌకర్యం అందించనుంది. 51 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్న వారు ప్రమాదంలో చనిపోయినా లేదా అంగవికులురైనా 3 లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది. 18-50 ఏళ్ల మధ్య వయస్సున్న వారు సహజ మరణం పొందితే 2 లక్షలు బీమా సౌకర్యం ఉంటుంది. రాష్ట్రంలో కోటిన్నర మంది ఈ పథకం పరిధిలోకి వస్తారని ప్రభుత్వం తెలిపింది. ఇక లబ్దిదారుల గుర్తింపు గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా చేపట్టనున్నారు. ప్రతి లబ్దిదారునికీ ప్రభుత్వం యూనిక్ ఐడీ నెంబర్ కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news