వైయస్సార్ నేతన్న నేస్తం నిధులు విడుదల : 80 వేల కుటుంబాలకు లబ్ధి

-

అమరావతి: వైయస్సార్‌ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన నేతన్నలకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ…దాదాపుగా 80 వేల మంది చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతోందన్నారు. ఈ పథకం కోసం రూ.192 కోట్లు జమచేస్తున్నామని పేర్కొన్నారు. నేతన్నలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు నా పాదయాత్రలో స్వయంగా చూశానని…ప్రతి జిల్లాలో చేనేతల సమస్యలు నాకు చెప్పకున్నారని చెప్పారు.

మగ్గంమీద బతుకుతున్న చేనేత కుటుంబానికి అక్షరాల రూ.24వేల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నామని..2 సంవత్సరాల 2 నెలల్లో వరుసగా మూడో విడత నేతన్న నేస్తం డబ్బులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ సొమ్ముతో మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు కన్నా… చేనేతలు బతకడానికి పడుతున్న ఇబ్బందులు ఎక్కువ అని భావించి.. ఈ 80వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు.ఇలా ఏటా దాదాపుగా రూ.200 కోట్లు చొప్పున 5 ఏళ్లకాలంలో రూ.1000 కోట్ల రూపాయలు కేవలం నేతన్న నేస్తం ద్వారానే ఇస్తున్నామని వివరించారు

Read more RELATED
Recommended to you

Latest news