” మూడు ” తో పవన్ ని గట్టిదెబ్బ కొట్టిన వైకాపా ?

-

ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కువగా పొత్తులు పెట్టుకోవడంతో సోషల్ మీడియాలో పవన్ పొలిటికల్ కెరియర్ పై సెటైర్లు మీద సెటైర్లు పడుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా వైసిపి పార్టీ నేత ఒకరు ” మూడు ” అంటూ పవన్ కళ్యాణ్ ని గట్టి దెబ్బ కొట్టే విధంగా హైలెట్ డైలాగులు పంచులు వేశారు.

Image result for pawan kalyan ysrcp

గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గ్లాసు దారుణంగా బద్దలైపోయింది అని గట్టిగా ప్రజలు పగలగొట్టారని షాకింగ్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ అయితే సినిమాలు అయినా చేయాలి లేకపోతే రాజకీయాలు అయినా చూసుకోవాలి అంటూ విమర్శించారు. అంతేగాని మధ్య మధ్యలో సినిమాలు చేయడం మళ్ళీ రాజకీయాలు చేయడం ఇదేంటి అంటూ ఘాటైన సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్.

 

అంతేకాకుండా పరోక్షంగా వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కి ఉన్నది మూడు, లేనివి కూడా మూడే నని, అది నేనెప్పుడో చెప్పాను అంటూ మరొకసారి పవన్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసారు. పవన్ కి సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరత్వం ఈ మూడు లేవని అన్నారు. ఆయనకి ఉన్న మూడు ఏంటో తెలుగు ప్రజలందరికి తెలుసని మూడు పెళ్లిళ్ల గురించి పరోక్షమైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయంగా పవన్ ని గట్టిదెబ్బ కొట్టారు. 

Read more RELATED
Recommended to you

Latest news