పాపం బొత్స – ఆ మాట అన్నందుకు సొంత పార్టీ లోనే చుక్కలు చూపిస్తున్నారు !

-

మీడియా సమావేశాలలో వైసిపి పార్టీ తరపున పాల్గొంటూ తెగ ఊదరగొట్టే నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ. చాలా సందర్భాలలో ప్రభుత్వాన్ని డిఫెన్స్ చేస్తూ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని విషయంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. అప్పట్లో వరదలు బీభత్సం గా రావడం తో అదే సందర్భంలో జగన్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో అమరావతి రాజధానిగా పనికిరాదని వరదలు దారుణంగా అమరావతి ప్రాంతంలో వరద నీరు ప్రవహిస్తున్నాయి అంటూ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సందర్భంలో రాజకీయంగా వైసిపి పార్టీ పై అనేక విమర్శలు వచ్చాయి. Image result for botsa satyanarayana

అయితే తాజాగా ఇటీవల కేంద్రం లో అధికారంలోకి వచ్చిన బిజెపి సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌ఆర్‌పి బిల్లులను తీసుకురావటం జరిగింది. దీంతో దేశంలో ఉన్న ముస్లింలు బిజెపి తీసుకున్న నిర్ణయం పై తీవ్రస్థాయిలో మండిపడుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి కీలక ఓటు బ్యాంకుగా ఎప్పటినుండో ముస్లిం మైనారిటీ వర్గం ఉండటంతో ఇటీవల వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన పై బొత్స చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా వైయస్ జగన్….మోడీ తో భేటీ అయిన సందర్భంలో వైసిపి పార్టీని ఎన్డీఏ లోకి రావాలని ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి.

 

దీంతో మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ వచ్చిన వార్తల్లో వాస్తవం ఎంత ఉంది అని విలేకరులు ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి తో కలసి పనిచేయటం గ్యారెంటీ అన్నట్టుగా మాట్లాడటంతో పార్టీలో ఉన్న మైనార్టీ నేతలు ఫుల్ సీరియస్ అయ్యారు. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన మైనార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ ఆ మాట అన్నందుకు చుక్కలు చూపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ బాషా తీవ్రస్థాయిలో బొత్స సత్యనారాయణ పై సీరియస్ అయ్యారట. దీంతో మీడియా సమావేశాల్లో బొత్స వ్యవహరిస్తున్న వ్యాఖ్యలకు వస్తున్న విమర్శలకు పాపం అన్నట్టుగా బొత్స పరిస్థితి పార్టీలో మారిపోయిందట.  

Read more RELATED
Recommended to you

Latest news