వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మొదటి మూడు నెలల్లో తిరుగులేని ఆధిపత్యం రాష్ట్రంలో నెలకొంది. ఆ తర్వాత వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు బెడిసికొట్టడంతో వైకాపా శ్రేణులు కొంత డైలమాలో పడటం జరిగింది. ముఖ్యంగా మూడు రాజధానుల విషయం అదేవిధంగా మండలి రద్దు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ నిర్ణయాలు ప్రజల ముందు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇటువంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో..ఎటువంటి వ్యూహాలతో ఎన్నికలలో కి వెళ్లాలి వంటి విషయాలలో త్వరగా మొదలు పెట్టండి జగన్ గారు బాబోయ్ అంటూ వైకాపా శ్రేణులు గోల గోల చేస్తున్నాయి. ఈ నెల చివరి కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వైకాపా క్యాడర్ లో మొత్తం ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది.
మరో పక్క ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలకు ఏ విధంగా వెళ్లాలి జగన్ సర్కార్ లో కూడా టెన్షన్ నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈ ఎన్నికలలో రిజల్ట్ తేడా పడితే మాత్రం ప్రతిపక్షాలు రెచ్చిపోవడం గ్యారెంటి. ఇటువంటి పరిస్థితుల మధ్య జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవటం జరుగుతుందో అని విపక్షాలు మరియు వైకాపా లో ఉన్న నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.