దొరల పాలనలో గురువులకు సరైన గౌరవం లేదు: వైఎస్ షర్మిల

-

ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో అన్ని పాఠశాలల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను స్మరించుకుని ఉంటారు, అంతే కాకుండా స్కూల్స్ లో తమ గురువులకు పిల్లలు ప్రత్యేకంగా ట్రీట్ చేసి ఉంటారు. ప్రతి సంవత్సరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంను జరుపుకుంటారు. తాజాగా ఈ విషయం గురించి YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో దొరల నియంత పాలన మాత్రమే కొనసాగుతోంది. ఇక్కడ గురువులకు సరైన గౌరవం దక్కడం లేదు అంటూ కామెంట్స్ చేసింది షర్మిల. సీఎం కేసీఆర్ యొక్క అనాలోచిత నిర్ణయం కారణంగా 9 మంది ఉపాధ్యాయులు అన్యాయంగా మరణించారంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పింది షర్మిల. ఇక ఈ రాష్ట్రంలో మొత్తం 22 వేల టీచర్ పోస్ట్ లు ఖాళీగా ఉంటే, కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేశారు అంటూ విమర్శించింది.

ఈ తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో గురువులకు ఎంత సముచిత స్థానాన్ని కల్పించారో అందరికీ తెలుసు అంటూ సెటైర్ వేసింది షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news