మీడియా పై కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్ .. !

-

నిన్న ఆసియా కప్ లో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది సూపర్ 4 కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అర్థ సెంచరీ తో రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక అయ్యారు. కాగా ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మీడియా మిత్రులపై ఫైర్ అయ్యారు. మీడియా వారిలో ఒకరు ఈ మధ్యన టీమ్ ఇండియా ప్లేయర్లు సరిగా ఆడడం లేదని విమర్శలు వస్తున్నాయి దీనికి మీ స్పందన ఏమిటి అని అడిగారు. ఈ ప్రశ్న వినగానే రోహిత్ శర్మకు ఎక్కడలేని ఆవేశం పుట్టుకు వచ్చింది… ఇటువంటి ప్రశ్నలు మీరు నన్ను అడగడం కరెక్ట్ కాదు, ఇంతకు ముందు నేను చాలా సార్లు ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పాను అంటూ బదులిచ్చాడు. ఇక మా గురించి బయట ఎవరు ఏమి మాట్లాడినా మేము పట్టించుకోము, మా ఆటతీరును మేము కొనసాగిస్తాం అంటూ మీడియా వ్యక్తికి సమాధానం చెప్పాడు రోహిత్ శర్మ.

ఇక సూపర్ 4 కు అడుగుపెట్టిన ఇండియా ఎవరితో తలపడుతుందో తెలియాలంటే ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఫలితం ఎవరితో తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news